Share News

కృష్ణమ్మ ఒడిలో కలెక్టర్‌ దంపతుల ఆధ్యాత్మిక యాత్ర

ABN , Publish Date - Jun 26 , 2026 | 11:26 PM

క లెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ గురువారం తన కుటుంబ సమేతంగా కొల్లాపూర్‌ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు.

కృష్ణమ్మ ఒడిలో కలెక్టర్‌ దంపతుల ఆధ్యాత్మిక యాత్ర
సోమశిల లలితాంబిక సోమేశ్వర ఆలయంలో కలెక్టర్‌ దంపతులను సన్మానిస్తున్న సర్పంచ్‌, ఆలయ చైర్మన్‌

- సోమశిల, సంగమేశ్వరంలో పూజలు

- స్పీడ్‌ బోట్‌లో శ్రీశైలం వెళ్లిన కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ దంపతులు

కొల్లాపూర్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి) : క లెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ గురువారం తన కుటుంబ సమేతంగా కొల్లాపూర్‌ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. తన సతీమణి, బాబుతో కలిసి వచ్చిన ఆయన కృష్ణా నది తీరంలో సోమశిల గ్రామంలో లలితాంబి కా సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ని ర్వహించారు. ఆలయ పురోహితులు సోమశిల క్షేత్రంలో పూర్ణకుంభంతో వారికిస్వాగతం పలికా రు. వారు ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గోవింద్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ కాటం వెంకటల క్ష్మిలు కలెక్టర్‌ దంపతులను శాలువాతో ఘనం గా సన్మానించారు.

కృష్ణానదిలో స్పీడ్‌ బోట్‌ ప్రయాణం

సోమశిల దర్శనానంతరం కలెక్టర్‌ కుటుంబ సభ్యులు అక్కడి నుంచి కృష్ణానది మీదుగా స్పీడ్‌ బోట్‌లో ప్రయాణించారు. నదీ గర్భంలో వెలిసిన సంగమేశ్వరుడికి వారు ప్రత్యేక పూజ లు చేశారు. అక్కడి నుంచి ప్రసిద్ధ అక్క మహా దేవి గుహలను సందర్శించి, అక్కడి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. స్పీడ్‌ బోట్‌ ద్వారా జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భన్సీలాల్‌, తహసీల్దార్‌ మాధవి, గ్రామ సర్పంచ్‌ కాటం వెంకటలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ, ఆలయ కమిటీ చైర్మన్‌ గోవింద్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Jun 26 , 2026 | 11:26 PM