Share News

Cold Wave: మళ్లీ పెరగనున్న చలి

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:49 AM

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కాస్త తగ్గి.. ప్రజలతో హమ్మయ్యా అనిపించిన చలి మళ్లీ వణికించబోతుంది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Cold Wave: మళ్లీ పెరగనున్న చలి

  • ఈ నెల 12 వరకు రాత్రిళ్లు వణుకు తప్పదంటున్న వాతావరణ నిపుణులు

హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొద్ది రోజులుగా కాస్త తగ్గి.. ప్రజలతో హమ్మయ్యా అనిపించిన చలి మళ్లీ వణికించబోతుంది. రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరగనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సోమవారం నుంచి వారం రోజుల పాటు (జనవరి 5-12 వరకు) రాత్రిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు మొదటివారంలో నెలకొన్న కోల్డ్‌వేవ్‌ పరిస్థితులు ఉంటాయని చెబుతున్నారు. గజగజ వణికించేలా చలిగాలులు వీచే అవకాశం ఉందని అంటున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా 25-26 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని పేర్కొంటున్నారు. మరోవైపు రాత్రి, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు ఉంటుందని హైదరాబాద్‌ వాతారణ కేంద్రం వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొంది. ఇక, శనివారం రాత్రి సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - Jan 05 , 2026 | 02:49 AM