Share News

వ్యవసాయ శాఖలో కోల్డ్‌వార్‌..

ABN , Publish Date - Oct 26 , 2026 | 11:35 PM

జిల్లా వ్య వసాయ శాఖలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఆ శాఖ జిల్లా అధికారిపై కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల నిరసన జ్వాలలు వెలువడుతున్నాయి.

వ్యవసాయ శాఖలో కోల్డ్‌వార్‌..

జిల్లా అధికారిపై నిరసన జ్వాలలు

అవినీతిపై రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదుల వెల్లువ

సెలవుల్లో వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులు

విచారణ అధికారిగా డీఆర్‌డీవోకు బాధ్యతలు..!

మంచిర్యాల, అక్టోబర్‌ 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వ్య వసాయ శాఖలో కోల్డ్‌వార్‌ నడుస్తోంది. ఆ శాఖ జిల్లా అధికారిపై కింది స్థాయి అధికారులు, ఉద్యోగుల నిరసన జ్వాలలు వెలువడుతున్నాయి. ఈ విషయమై రాష్ట్ర స్థాయిలో పిర్యాదులు అందినప్పటికీ సిబ్బంది ప్ర మేయంపై ఒత్తిడిలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్ర మంలో సెలవుల్లో వెళ్లేందుకు ఆ శాఖ ఉద్యోగులు, కిం ది స్థాయి సిబ్బంది సిద్ధపడుతున్నట్లు తెలిసింది. జిల్లా లోని వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) ఆ శాఖ జిల్లా అధికారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ని బంధనలకు విరుద్ధంగా అధికారి తమను వేధింపుల కు గురి చేస్తున్నట్లు స్వయంగా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర కమి షనర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుల వెల్లువ.....

జిల్లా అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ (డీఏవో) సురేఖ వేధిం పులు భరించలేకపోతున్నామని జిల్లాలోని ఆ శాఖకు చెందిన ఏవోలు, ఏఈవోలు వ్యవసాయ శాఖ కమిషనర్‌ కు ఇటీవల ఫిర్యాదు చేశారు. తమ సమస్యలపై విచా రణ జరిపి న్యాయం చేయాలని పేర్కొనగా స్పందించిన కమిషనర్‌ ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జ రిపించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను ఆదేశించారు. దీం తో కలెక్టర్‌ డీఆర్‌డీవో కిషన్‌కు ఎంక్వైరీ బాధ్యతలు అప్ప గించారు. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా విచారణ అధికారి జిల్లాలోని వ్యవసాయ శాఖకు చెందిన ఏఈవో లతో విచారణ జరుపుతున్నారు. ఆయా క్యాడర్ల ఉద్యోగు లు స్పందిస్తూ తమను జిల్లా అధికారి వేధింపులకు గు రి చేస్తున్నట్లు తెలియజేస్తూ రాత పూర్వకంగా విచారణ అధికారికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఉ ద్యోగ పరంగా చర్యలు తీసుకుంటే పర్వాలేదని, వ్యక్తి గతంగా ఇబ్బందులకు గురి చేయడంతోనే తామంతా మానసిక ఆందోలనకు గురవుతున్నామనే భావన కింది స్థాయి ఉద్యోగుల్లో నెలకొంది. ఈ క్రమంలో ఉన్నతాధి కారి వేధింపులు తాళలేక కింది స్థాయి ఉద్యోగి ఒకరు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగ ట్టాడనే ప్రచారం కూడా జరుగుతుంది. సదరు అధికారి ని వైఖరి పట్ల క్షేత్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతు న్నప్పటికీ జిల్లాఉన్నతాధికారులు పట్టించుకోవడం లేద నే ఆరోపణలున్నాయి.

నిస్పక్షపాతంగా విచారణ జరిగేనా...?

వ్యవసాయ శాఖలో నెలకొన్న సమస్యలు, వేధింపుల పై జిల్లా డీఆర్‌డీవోకు విచారణ బాద్యతలు అప్పగించ డం పట్ల సర్వత్ర హర్షాదిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ అధికారి నిస్పక్షపాతంగా వ్యవహరిస్తేనే తమ కు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కిందిస్థాయి ఉ ద్యోగులు, సిబ్బంది ఉన్నారు. విచారణ అధికారి ఇటీవ ల వ్యవసాయ శాఖకు చెందిన సుమారు 70 మంది సి బ్బందిని పిలిపించి పూర్తి స్థాయిలో సమాచారం రాబ ట్టినట్లు తెలుస్తోంది. ఫెర్టిలైజర్‌ షాపుల నుంచి సదరు అధికారి ఓ కారును బహుమతిగా పొందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపైనా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆ అధికారి వేధింపుల వ ల్ల ఇప్పటికే జిల్లా నుంచి పలువురు సిబ్బంది, ఉద్యోగు లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లగా మరి కొంత మంది కూడా అదే బాటలో పయ నించేందుకు సిద్ధంగా ఉ న్నట్లు తెలుస్తోంది.

పిర్యాదు చేసిన వారిపై బూతుపురాణం....

ఇదిలా ఉండగా తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఏఈవోలు, ఏవోలపై సదరు అధికారి బూతు పు రాణం మొదలెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పలువురు కింది స్థాయి ఉద్యోగులు, అధికా రులు బాహాటంగానే ప్రచారం చేయడం కొసమెరుపు. ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారిపై విచారణ జరుగుతున్న క్రమంలో ఓ మండల అధికారి తన పరిధిలో పని చేస్తున్న వారిపై కఠిన చర్యలకు పూ నుకున్నట్లు తెలుస్తోంది. జిల్లా వ్యవసాయ అధికారికి వ్యతిరేకంగా సమాచారం ఇవ్వవద్దని ఆయన హుకుం జారీ చేసినట్లు సమాచారం. జిల్లా వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతి ఆరోపణల పట్ల కలెక్టర్‌ పూర్తి స్థాయిలో విచారణ జరిపితే తప్ప వాస్తవాలు వెలుగు చూసే అవకాశం లేదు.

Updated Date - Oct 26 , 2026 | 11:35 PM