kumaram bheem asifabad- బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించాలి
ABN , Publish Date - Jan 01 , 2026 | 10:17 PM
నూతనోత్సహంతో పని చేసి ఈ ఆర్థిక సంవత్సరా నికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజభా స్కర్‌రెడ్డ అన్నారు. గురువారం గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు.
రెబ్బెన, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతనోత్సహంతో పని చేసి ఈ ఆర్థిక సంవత్సరా నికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజభా స్కర్‌రెడ్డ అన్నారు. గురువారం గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ బెల్లంపల్లి ఏరియాలో ఇప్పటి వరకు ఉత్పత్తి, నాణ్యణ విషయంలో ముందుందని చెప్పారు. రానున్న 90 రోజుల్లో 100 శాతం ఉత్పత్తి సాదించేందుకు ఉద్యోగులు కృషి చేయాలన్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పని చేయాలని పేర్కొన్నారు. గత ఏడాది నిర్వహించిన స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో జీఎం కార్యాలయ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, అధికారులు నరేందర్, కృష్ణమూర్తి, రాజమల్లు, ప్రశాంత్ పాల్గొన్నారు.
గోలేటిలో సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
రెబ్బెన, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): గోలేటి టౌన షిప్‌లో మాత్రమే కాకుండా పరిసర పారంతాల ప్రజల సౌకర్యార్థం సింగరేని సంస్థ ప్రాధాన్యం ఇస్తోందని బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలోని జీటీసీఓఏ క్లబ్‌లో వెళ్లేందుకు నూతన మార్గ్నా, ఆర్చీని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గోలేటిలో పలు అభివృద్ధి పనులు చేయిం చామని చెప్పారు. ఏసీ పంక్షన్ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి తిరుపతి, అధికారులు నరేందర్, కృష్ణమూర్తి, రాజమల్లు, మదీనా బాషా, జ్ఞానేశ్వర్, ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.