Share News

2లక్షల కోట్ల పెట్టుబడులు..5 లక్షల ఉద్యోగాల కల్పన

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:13 AM

తెలంగాణను ‘లైఫ్‌ సైన్సె్‌స’కు అడ్డాగా మార్చేలా కృషి చేస్తోంది. అత్యంత అధునాతమైన సదుపాయాలు, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

2లక్షల కోట్ల పెట్టుబడులు..5 లక్షల ఉద్యోగాల కల్పన

  • రూ.1000 కోట్లతో లైఫ్‌ సైన్సెస్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌

  • తెలంగాణ నెక్స్ట్‌ జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీని ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ‘లైఫ్‌ సైన్సె్‌స’కు అడ్డాగా మార్చేలా కృషి చేస్తోంది. అత్యంత అధునాతమైన సదుపాయాలు, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు, ప్రపంచ స్థాయి సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ‘‘తెలంగాణ నెక్స్ట్‌ జెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పాలసీ 2026-2030’’ని రూపొందించింది. దీనిని దావో్‌సలో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆ పాలసీలో లైఫ్‌ సైన్సెస్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంచుకున్న మార్గాలు, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలను ప్రభుత్వం వివరించింది. దాని ప్రకారం.. 2030 నాటికి దాదాపు రూ.2లక్షల కోట్ల (25 బిలియన్‌ డాలర్లు) పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే ఈ రంగంలోనే సుమారు 5 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుంది. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ఇన్నోవేషన్‌ ఫండ్‌, నైపుణ్యాభివృద్ధి, వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, లైఫ్‌ సైన్సెస్‌ గ్రిడ్‌, మెడిక ల్‌ డివైజ్‌ పార్క్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సహా పలు అంశాలతో పాలసీని రూపొందించింది. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థలో లైఫ్‌ సైన్సెస్‌ రంగం వాటాను మరింత పెంచేలా ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ప్రస్తుతం రూ.73వేల కోట్లుగా ఉన్న పెట్టుబడులను వచ్చే ఐదేళ్లలో రూ.2లక్షల కోట్లకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అవసరమైన భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన స్టాంప్‌ డ్యూటీని 100 శాతం రాయితీగా ఇవ్వనున్నారు. మరోవైపు పారిశ్రామిక అవసరాలకు వినియోగించుకున్న విద్యుత్‌కు చెల్లించిన మొత్తంలో(మొదటి 5 ఏళ్ల కాలానికి)యూనిట్‌కు ఒకటి నుంచి రెండు రూపాయల వరకు రీయంబర్స్‌మెంట్‌ చేయనున్నట్టు పాలసీలో పొందుపర్చారు.


మూలధన పెట్టుబడిపై రాయితీలు..

కంపెనీలకు మూలధన పెట్టుబడి పై వివిధ స్లాబుల్లో రాయితీలను ఇవ్వనున్నారు. అలాగే కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించి, వ్యాపారం మొదలయ్యాక కంపెనీలు పెట్టిన మూలధన పెట్టుబడి తిరిగి వచ్చే వర కు లేదా మొదటి 5-7 ఏళ్ల వరకు రాష్ట్ర వస్తు-సేవల పన్నును ప్రభుత్వం తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగ భద్రత కింద ఉద్యోగులకు కంపెనీ చెల్లించే ఈపీఎ్‌ఫలోనూ ప్రభుత్వం కొంత సాయం అందించనుంది. ఇక డేటా ఆధారిత ఆరోగ్య సేవలు, గోప్యతా ప్రమాణాలు, డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు, స్టార్ట్‌పలు, ఇతరత్రా పరిఽశోధనల కోసం రూ.100 కోట్ల ప్రారంభ నిధి ప్రారంభం, దీనిని భవిష్యత్‌లో రూ.1000 కోట్ల వరకు విస్తరించేలా ప్రత్యేక లైఫ్‌ సైన్సెస్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఏర్పాటుచేయనున్నారు. అలాగే భవిష్యత్‌ మానవ వనరుల తయారీ కోసం ‘తెలంగాణ స్కూల్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సె్‌స’ను కూడా ఏర్పాటుచేయనున్నారు. లైఫ్‌ సైన్సెస్‌ పార్కుల్లో 24 గంటలపాటు కార్యకలాపాలకు అనుమతిని ఇవ్వనున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని రాయితీ ధర కింద అందించనుంది. మౌలిక సౌకర్యాలను కల్పి ంచనుంది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ ఫార్మాసిటీని ఏర్పాటుచేయనున్నట్టు పాలసీలో పేర్కొన్నారు. మొత్తంగా 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోనే టాప్‌ ఐదు లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా నిలిపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది.

Updated Date - Jan 22 , 2026 | 05:13 AM