kumaram bheem asifabad- సీఎం సారూ.. ఆలకించరూ..
ABN , Publish Date - May 30 , 2026 | 11:46 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి సమస్యలు పరి ష్కారానికి నోచుకొలేదు. దశాబ్దాలుగా జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లు గా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండ డంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. కుమరం భీం ప్రాజెక్టు ప్రధాన అనకట్ట దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ఆనకట్ట మరమ్మతులకు నోచుకోవడం లేదు.
- రేపు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- దృష్టి సారించాలని జిల్లా ప్రజల వేడుకోలు
ఆసిఫాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడి సమస్యలు పరి ష్కారానికి నోచుకొలేదు. దశాబ్దాలుగా జిల్లా రైతాంగానికి వర్షాధారమే సాగ దిక్కవుతుంది. ఏళ్లు గా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండ డంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. కుమరం భీం ప్రాజెక్టు ప్రధాన అనకట్ట దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ఆనకట్ట మరమ్మతులకు నోచుకోవడం లేదు. జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.
- నత్తనడకన..
జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని పెద్ద వాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్ద న్నర కాలం అయినా పూర్తికాలేదు. కెరమెరి మండ లంలోని అనార్‌పల్లి-కరంజివాడ, లక్మాపూర్ వంతె నల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్- వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15 ఏళ్లు గడుస్తున్నా నేటికి అసంపూర్త్తిగానే మారాయి. తిర్యాణి మండలంలోని నాయకపుగూడ గ్రామం నుంచి దుగ్గపూర్ గ్రామానికి మద్యలో వాగు పై నిర్మిస్తున్న వంతెన నేటికి పూర్తి కాలేదు, జిల్లాలో నేటికీ 449 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యానికి నోచుకోకపోవడంతో ఆయా గ్రామాలకు వెళ్లాలంటే నిత్యం నరకయాతన పడుతున్నారు. జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాలు సమస్యల సుడిగుం డంలో కొట్టుమిట్టాడుతున్నాయి వసతి గృహాలు, గురుకులాలకు సరిపడా భవనాలు నిర్మించక పోవడంతో నేటికి కొన్ని గురుకులాలు అద్దె భవ నాల్లో అరకొర వసతుల మధ్య నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న సొంత భవనాల్లో కూడ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. భవనాలు శిథిలా వస్థకు చేరుకోవడం, గదులు సరిపొక పోవడంతో విద్యార్థుల అవస్థలు పడుతున్నారు. మెడికల్ కళాశాలలో వైద్యవిద్యను బోదించే ప్రొఫెసర్, అసోసియోటెడ్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి 300 పడకలకు స్థాయికి పెంచి మెడికల్ కళాశాలకు అనుసంధానంగా మార్చిన స్పెషలిస్టు వైద్యులు లేక సరైన వైద్యం అందడంలేదు.
- రహదారులు, ఒర్రెలపై..
జిల్లాలోని బెజ్జూరు, పెంచికలపేట, దహెగాం, సిర్పూర్(టి), వాంకిడి, తిర్యాణి తదితర మండలా ల్లో మారుమూల గ్రామాలకు రహదారులు, ఒర్రెలపై వంతెనల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అటవీ శాఖ అనుమతులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. దీంతో ఏటా వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు కల్వర్టులు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచి పోతున్నాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాల ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, వంతెనలు లేక ఆయా గ్రామాలకు క,నీసం అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బెజ్జూరు మండలంలోని పాపన్నపేట నుంచి పెంచికలపేట మండలంలోని కమ్మర్‌గాం మీదుగా మొర్లిగూడ వరకు రోడ్డు నిర్మాణాలకు రూ.36కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు సైతం పూర్తి కాగా అటవీ అనుమతులు లేవన్న కారణంతో పనులు చేపట్టలేదు. దహెగాం మండలంలోని మొట్లగూ డ-ఖర్జీ గ్రామానికి అప్పటి ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేసింది. దీనికి కూడా అనుమతులు లేక రోడ్ల పనులు ఆగిపోయాయి. బెజ్జూరు మండలంలోని సోమిని-తలాయి మీదుగా మొర్లిగూడకు రూ.18కోట్లు, దహెగాం మండ లంలోని పార్వతిపేట-చిన్నగుడిపేట మధ్య కొంత మేర బీటీ పనులు చేపట్టారు. కానీ అనుమతులు లేక మధ్యలోనే నిలిచింది. వాంకిడి మండలం నుంచి కాగజ్‌నగర్ మండలంలోని మాలిని మీదుగా సిర్పూర్(టి) వరకు నిధులు మంజూరు చేయగా అటవీ అనుమతుల కారణంగా పనులు నిలిచిపో యాయి. తిర్యాణి మండలంలోని మాణిక్యాపూ ర్-మంగి రహదారి నిర్మాణానికి సింగరేణి యాజ మాన్యం భూనిర్వాసితుల కోసం రహదారుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది. మూడు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. కానీ మిగితా పనులు నిలిచిపోయాయి. తిర్యాణి మండ లం రొంపల్లి-గుండాల రోడ్డు నిర్మాణానికి 2011లో రూ.5కోట్లను మంజూరు చేసింది. ఐటీడీఏ ఆధ్వ ర్యంలో ఈ పనులు చేపట్టారు. వంతెన పనులు పూర్తి చేశారు. అటవీ ప్రాంతంలో అనుమతులు లేవన్న కారణంతో పనులు నిలిపివేశారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చొరవ చూపి జిల్లాలో అసంపూర్తి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.