Share News

జిల్లాపై సీఎం వరాల జల్లు..

ABN , Publish Date - Apr 06 , 2026 | 10:41 PM

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజక వర్గంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించినబహిరంగ సభలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాపై వరాల జల్లు లు కురిపించారు. గూడెం ఆలయ అభివృద్ధితోపాటు కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వ ద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభిం చనున్నట్లు సభా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు హా మీ ఇచ్చారు.

జిల్లాపై సీఎం వరాల జల్లు..
సీఎంవంత్‌రెడ్డికి గూడెం ఆలయం ప్రసాదం అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంచిర్యాల మేయర్‌ ధరణి మధూకర్‌, డిప్యూటీ మేయర్‌ రమ్య

==================

-గూడెం ఆలయం అభివృద్ధికి చర్యలు

-ప్రాణహిత-చేవేళ్ల పనులకు త్వరలో శ్రీకారం

-పిప్పిరి సభ సాక్షిగా ముఖ్యమంత్రి హామీల వర్షం

-బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా జన సమీకరణ

మంచిర్యాల, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజక వర్గంలోని పిప్పిరి గ్రామంలో సోమవారం నిర్వహించినబహిరంగ సభలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి మంచిర్యాల జిల్లాపై వరాల జల్లు లు కురిపించారు. గూడెం ఆలయ అభివృద్ధితోపాటు కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని తుమ్మిడిహెట్టి వ ద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును త్వరలో ప్రారంభిం చనున్నట్లు సభా సాక్షిగా ముఖ్యమంత్రి ప్రజలకు హా మీ ఇచ్చారు. సీఎం హామీలతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, త్వరలో చర్యలు చేపట్టాలన్న ఆదే శాలు జిల్లా కలెక్టర్‌లకు జారీ అయ్యాయి.

గూడెం ఆలయం అభివృద్ధికి చర్యలు...

జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం రమాస హిత శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయనన్నట్లు సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. ఇక గూడెం ఆలయంలో భక్తుల రద్దీకి సరిప డా సౌకర్యాలు లేవని, అభివృద్ధి చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి దృ ష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎం గూడెం స త్యనారాయణ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరం గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రేంసాగర్‌రావు అభ్యర్థన మేరకు గోదావరి పుష్కర పనుల్లో భాగంగా ఆలయాల అభివృద్ధికి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధిలో భాగంగా గూడెం ఆలయానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మొట్ట మొదట గూడెం ఆల యం పనులు చేపట్టిన తరువాతనే మిగతా మందిరాల పనులు చూడాలన్నారు. గూడెం ఆలయం అభివృద్ధికి ఎన్ని నిధులు అవసరం అవుతాయో ప్రతిపాదనలు పంపాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా గూ డెం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఎమ్మెల్యే మం చిర్యాల మునిసిపల్‌ మేయర్‌ ధరణి మధూకర్‌, డి ప్యూటీ మేయర్‌ సల్ల రమ్యలతో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు.

ప్రాణహిత -చేవేళ్ల ప్రారంభానికి హామీ....

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే ప్రాణహిత-చేవేళ్ల పునర్నిర్మాణ పనులను త్వ రలో ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారు. తలాపునే గోదావరి ఉన్నప్పటికీ ఇక్కడి రైతాంగానికి సరిపడా సాగునీరు అందడంలేదని, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రేం సాగర్‌రావు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పం దించిన సీఎం త్వరలోనే ప్రాజెక్టు పనులు ప్రారంభి స్తామని హామీ ఇచ్చారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టును కాలరాసి, గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని, దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని సీఎం అన్నారు. 160 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మా ణం జరిగితే ఉమ్మడి ఆదిలాబాద్‌ రైతాంగానికి సాగు నీటి ఇబ్బందులు తప్పుతాయని ముఖ్యమంత్రి అభిప్రా యపడ్డారు. కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తామని, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమా ర్‌ రెడ్డి అవసరమైన ప్రణాళికలు సిద్దం చేసే పనిలో నిమగ్నమయ్యారని అన్నారు. ప్రాజెక్టు పునర్నిర్మాణ ప నులను తానే ప్రారంభిస్తాని, వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీళ్లు పారించడం ద్వారా ఇక్కడి రైతుల కళ సా కాకారం చేస్తానని రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు.

సీఎం సభకు భారీగా జనసమీకరణ....

బోథ్‌ నియోజక వర్గంలోని పిప్పిరిలో జరిగిన ముఖ్యమంత్రి బహిరంగ సభకు మంచిర్యాల జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. ఉదయం ఎనిమిది గంటలకు 500కుపైగా బస్సులు, వందకు పైగా కార్లలో దాదాపు 30వేలకు పైగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలను ఆ పా ర్టీ నాయకులు తరలించారు. కాంగ్రెస్‌ హయాంలో అ ప్పటి శాసనసభా పక్షనేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాద యాత్రకు మూడేళ్లు పూర్తి కావస్తుండటం, రేవంత్‌ ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ఉత్సవాల్లో భాగంగా పిప్పిరిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రతి డివిజన్‌కు 300 మంది లక్ష్యంగా జనసమీకరణ జరిగింది. అలాగే చె న్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల నుంచి సైతం పెద్ద మొత్తంలో ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలి వెళ్లారు.

Updated Date - Apr 06 , 2026 | 10:41 PM