Share News

నేడు ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ కీలక ఉపన్యాసం

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:29 AM

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్‌ మండపంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం కీలక ఉపన్యాసం చేయనున్నారు.

నేడు ఏఐ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌ కీలక ఉపన్యాసం

  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి దుద్దిళ్ల

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలోని భారత్‌ మండపంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 నుంచి 12.42 గంటల వరకు ఆయన ప్రసంగిస్తారు. అలాగే.. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సదస్సులో భాగంగా నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు.. స్వీడన్‌ వ్యాపార ప్రతినిధుల బృందంతో శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమావేశమవుతారు. ఈ సమావేశ వేదికను మంత్రి పేషీ నిర్ణయించనుంది. అలాగే ఉదయం 10.30 నుంచి 11.25 గంటల వరకు.. భారత్‌ మండపం వెస్ట్‌వింగ్‌లోని రూమ్‌ నంబర్‌ 6లో జరిగే కార్యక్రమంలో శ్రీధర్‌బాబు ప్రసంగించనున్నారు. ‘హెటెరోజీనియస్‌ కంప్యూట్‌ ఫర్‌ డెమోక్రటైజింగ్‌ యాక్సెస్‌ టు ఏఐ: ఫ్రమ్‌ వర్క్‌ లోడ్‌ అవేర్‌నెస్‌ టు స్కేలబుల్‌ డిప్లాయ్‌మెంట్‌’ అనే అంశంపై ఆయన మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.25 గంటల వరకు.. భారత్‌ మండపంలోని రూమ్‌ నంబర్‌ 8లో జరిగే ‘ఏఐ ఏజెంట్స్‌ ఫర్‌ ఏ బెటర్‌ టుమారో: గవర్నమెంట్‌ సర్వీసెస్‌, క్లైమెట్‌ యాక్షన్‌ అండ్‌ రెసిలియంట్‌’ సెషన్‌లోనూ మంత్రి పాల్గొంటారు.

Updated Date - Feb 20 , 2026 | 01:29 AM