Share News

హ్యాపీ బర్త్‌డే.. మహేశ్‌ గౌడ్‌!

ABN , Publish Date - May 25 , 2026 | 05:25 AM

టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు మహేశ్‌గౌడ్‌కు ఆయురారోగ్యాలను....

హ్యాపీ బర్త్‌డే.. మహేశ్‌ గౌడ్‌!

  • టీపీసీసీ చీఫ్‌కు సీఎం రేవంత్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు మహేశ్‌గౌడ్‌కు ఆయురారోగ్యాలను, ప్రజలకు మరింతగా సేవ చేసే శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. మహేశ్‌ గౌడ్‌ నాయకత్వంలో భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌ మరింత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి, తిరుగులేని రాజకీయ విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా.. మహేశ్‌ గౌడ్‌ పుట్టినరోజు సందర్భంగా గాంధీభవన్‌లో ఘనంగా వేడుకలు జరిగాయి. ఎంపీ మల్లు రవి పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ కేక్‌ను కట్‌ చేశారు.

Updated Date - May 25 , 2026 | 05:25 AM