ప్రజలపై యేసు కరుణ ఉండాలి: సీఎం
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:50 AM
యేసు ప్రభు ప్రేమ, కృప, కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిలషించారు. యేసు త్యాగాలకు గుర్తుగా...
హైదరాబాద్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): యేసు ప్రభు ప్రేమ, కృప, కటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిలషించారు. యేసు త్యాగాలకు గుర్తుగా జరుపుకొనే గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు యేసు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.