6న బాసరకు సీఎం రేవంత్
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:08 AM
ఈనెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రానికి రానున్నారు. ఆలయ పునిర్నిర్మాణ పనులను...
బాసర, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఈనెల 6వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతీ క్షేత్రానికి రానున్నారు. ఆలయ పునిర్నిర్మాణ పనులను ఆయన భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు బాసరకు వచ్చారు. కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు.