CM Revanth Reddy to Undertake Sudigali Tour: పండగ తర్వాత సీఎం రేవంత్ సుడిగాలి పర్యటనలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:08 AM
సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 16న ఆయన ఆదిలాబాద్ వెళ్లనున్నారని, అక్కడున్న....
16న ఆదిలాబాద్, 17న మహబూబ్‌నగర్
18న ఖమ్మం, 19న మేడారంలో పర్యటన
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. 16న ఆయన ఆదిలాబాద్ వెళ్లనున్నారని, అక్కడున్న ‘చనాకా-కొరాటా’ బ్యారేజీని పరిశీలించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే బ్యారేజీ నిర్మాణం పూర్తవగా, నీటి పారుదల పనులు చేయాల్సి ఉంది. వాటిని క్షేత్రస్థాయికి వెళ్లి తెలుసుకోనున్నట్టు సమాచారం. ఆ తర్వాత 17న మహబూబ్‌నగర్ జిల్లాకు వెళతారని, అక్కడ పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిసింది. 18న ఖమ్మం వెళ్లి సీపీఐ ఆవిర్భావ వందేళ్ల ఉత్సవాల సభలో పాల్గొంటారని సమాచారం. అనంతరం అటు నుంచే ములుగు జిల్లాలోని మేడారం వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసి 19న ఉదయమే సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోనున్నారు. అనంతరం హైదరాబాద్‌కు వచ్చి పెట్టుబడుల సదస్సు కోసం దావోస్ వెళతారని తెలిసింది.