పీసీ ఘోష్ నివేదికపై నేడు సీఎం సమీక్ష
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:50 AM
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో ...
హైదరాబాద్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు ఐఏఎస్ అధికారులపై చర్యలు వద్దంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను ఖరారు చేసే అంశంపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇందులో అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు ఇతర న్యాయనిపుణులు సైతం పాల్గొననున్నారు. అలాగే గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గ్రావీటి ద్వారా నీటి సరఫరాతో పాటు మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణలో పురోగతిపై సైతం ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.