Share News

‘ఎస్‌ఐఆర్‌’ పట్ల కాంగ్రెస్‌ సన్నద్ధతపై..నేడు సీఎం రేవంత్‌ సమీక్ష

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:05 AM

రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధతపై ...

‘ఎస్‌ఐఆర్‌’ పట్ల కాంగ్రెస్‌ సన్నద్ధతపై..నేడు సీఎం రేవంత్‌ సమీక్ష

  • పాల్గొననున్న మీనాక్షి, మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధతపై బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. జూమ్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎస్‌ఐఆర్‌కు సంబంధించి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొననున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి, మహేశ్‌కుమార్‌ దిశానిర్దేశనం చేయనున్నారు. ఈ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభం కానుంది.

Updated Date - Jun 24 , 2026 | 04:05 AM