చింతకాని వద్ద 2 లక్షల మంది రైతులతో సీఎం సభ
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:28 AM
ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డులో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను రెండు లక్షల మంది రైతులతో చరిత్రలో ...
30న నిర్వహిస్తాం: భట్టి
భరోసా నిధులు జమచేస్తామని వెల్లడి
ఖమ్మం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డులో ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభను రెండు లక్షల మంది రైతులతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సభ జరిగే ఖమ్మం జిల్లా మధిర నియోజవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం క్రాస్‌రోడ్డు వద్ద సుమారు 20 ఎకరాలకు పైగా సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సభా వేదిక ఏర్పాటు, రహదారులు, పార్కింగ్, రైతు ఎగ్జిబిషన్, స్టాళ్ల ఏర్పాటు తదితర విషయాలపై చర్చించారు. భారీవర్షం వచ్చినా రైతు ఎలాంటి అవాంతరాలు లేకుండా సౌకర్యాలు కల్పించే విషయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం భట్టి బహిరంగ సభ ఏర్పాట్లపై మధిర నియోజకవర్గ నాయకులు కార్యరక్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సభకు సుమారు 2లక్షల మంది రైతులను ఆహ్వానించి వారి సమక్షంలోనే రైతుభరోసా నిధులను ఖాతాల్లోకి జమ చేస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, మంత్రులంతా ఈ సభకు హాజరవనున్న నేపథ్యంలో విజయవంతానికి అందరూ శ్రమించాలని అధికారులకు సూచించారు.