1 నుంచి సీఎం జిల్లాల పర్యటన
ABN , Publish Date - May 31 , 2026 | 05:15 AM
సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 1 నుంచి 4 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలం కొఠారి పరిధిలోని కొత్తగూడ...
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి జూన్ 1 నుంచి 4 వరకు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కెరిమరి మండలం కొఠారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొంటారు. 3న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనతో పాటు కోహెడలో 239 ఎకరాల్లో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్‌కు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. అయితే అదే రోజు సీఎం రేవంత్ బెంగళూరు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉందని తెలిసింది. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవ్వనున్నట్లు సమాచారం. అయితే వాయిదా పడిన కార్యక్రమాలను 4 లేదా 5వ తేదీలకు మార్చనున్నట్టు సమాచారం. 4న మహబూబ్‌నగర్‌లోని జూరాల ఎత్తిపోతల పథకం పరిశీలనకు వెళ్లేందుకు సీఎం టూర్ ప్రాథమికంగా నిర్ణయించగా, అందులోనూ మార్పులు ఉండే అవకాశం ఉంది.