Share News

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్‌

ABN , Publish Date - Mar 25 , 2026 | 04:15 AM

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. భద్రాచలం దేవస్థానంలో ఈనెల 27న జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి, 28న జరిగే మహాపట్టాభిషేక వేడుకలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా హాజరుకానున్నారు.

భద్రాద్రి రామయ్య కల్యాణానికి సీఎం రేవంత్‌

  • పట్టాభిషేకానికి గవర్నర్‌

భద్రాచలం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని.. భద్రాచలం దేవస్థానంలో ఈనెల 27న జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి, 28న జరిగే మహాపట్టాభిషేక వేడుకలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా హాజరుకానున్నారు. కల్యాణానికి.. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మరోవైపు, రామనవమి వేడుకల కోసం భద్రాచలం ముస్తాబవుతోంది. సీఎం, గవర్నర్‌లతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు రామయ్యను దర్శించుకోనున్నారు. దీంతో అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 04:15 AM