Share News

ఉత్తర ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులివ్వండి

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:31 AM

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి..

ఉత్తర ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులివ్వండి

ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి కేంద్ర క్యాబినెట్‌ అనుమతి ఇప్పించాలని వినతిపత్రం అందజేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ భాగానికీ అనుమతులు ఇవ్వాలన్నారు. రెండు వైపులా ఒకేసారి పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, వ్యయం కూడా తగ్గుతుందని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి అమరావతికి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్‌కు 12 వరసల రహదారి మంజూరు చేస్తే హైదరాబాద్‌-విజయవాడ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. మన్ననూరు-శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌కు అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని గడ్కరీని కోరారు. హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్‌ రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల రహదారికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి అవసరమైన భూ సేకరణ తాము చేపడతామని తెలిపారు.

Updated Date - Jul 15 , 2026 | 05:32 AM