తుంగభద్ర, ఆర్డీఎస్‌పైనా నేడు సీఎం సమీక్ష
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:07 AM
తుంగభద్ర డ్యామ్‌తో పాటు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్), కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలపై బుధవారం ....
తుంగభద్ర డ్యామ్‌తో పాటు రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్), కృష్ణా, బీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలపై బుధవారం సాయంత్రం 5 గంటలకు సీఎంరేవంత్‌రెడ్డి జలసౌధలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు తుంగభద్ర జలాశయం గేట్ల ప్రారంభోత్సవం జరుగనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తదితరులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఉన్నతస్థాయి సమావేశం జరుగనుండగా.. అందులో ఏయే అంశాలు లేవనెత్తాలనే దానిపై నేడు నిర్వహించే సమీక్షలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీఎంకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో వివరించనున్నారు. ప్రధానంగా ఆర్డీఎస్ ఆధునికీకరణ చేపట్టాలని కర్ణాటకను తెలంగాణ కోరే అవ కాశం ఉంది. ఆర్డీఎస్ కింద 15.9టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా.. ఏ సంవత్సరంలోనూ వాటా మేరకు నీరు అందలేదని ప్రభుత్వం నివేదించనుంది.