తెలంగాణ ప్రగతికి సహకరించండి
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:56 AM
తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకారం అందించాలని అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో సీఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకారం అందించాలని అడోబ్ సంస్థ సీఈవో శంతను నారాయణ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. శంతను నారాయణ్ ముఖ్యమంత్రిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌కు సంబంధించిన అంశాలపె సీఎం రేవంత్‌తో ఆయ న చర్చించారు. గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాట్లాడారు. ఇందుకు స్పందించిన సీఎం రేవంత్.. తెలంగాణను మాన్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలనేది తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం కొన్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.