3 వాహనాలతోనే సీఎం రేవంత్ కాన్వాయ్!
ABN , Publish Date - May 15 , 2026 | 04:31 AM
పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలు తగ్గాయి. సీఎం ఆదేశాల మేరకు వాహనాల కుదింపుపై భద్రతా విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.
ట్రయల్ నిర్వహించిన సీఎం భద్రతా విభాగం
మంత్రుల కాన్వాయ్‌ల్లోనూ వాహనాల కుదింపు
హైదరాబాద్, మే 14 (ఆంధ్రజ్యోతి): పొదుపు చర్యల్లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌లో వాహనాలు తగ్గాయి. సీఎం ఆదేశాల మేరకు వాహనాల కుదింపుపై భద్రతా విభాగం అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటిదాకా సీఎం కాన్వాయ్‌లో 9 వాహనాలు ఉండగా.. తాజాగా 3 వాహనాలతోనే ట్రయల్ నిర్వహించారు. ఈ మేరకు గురువారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం నుంచి మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం వరకు సీఎం వచ్చి, వెళ్లే సమయంలో 3 వాహనాలే ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే, ఈ ట్రయల్ రన్‌ను భద్రతా పరంగా పరిశీలించిన తర్వాత మరొక వాహనాన్ని పెంచాలా? వద్దా? లేక మరో వాహనాన్ని తగ్గించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఢిల్లీలో ప్రధాని మోదీ రెండు వాహనాల్లోనే వెళ్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ కాన్వాయ్‌లోనూ మూడు లేక రెండు వాహనాలనే వినియోగించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ అంశంపై శుక్రవారం స్పష్టత వస్తుందని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. కాగా, శుక్ర, శనివారాల నుంచి మంత్రుల కాన్వాయ్‌ల్లోని వాహనాలను సైతం కుదించనున్నట్లు అధికారులు తెలిపారు.
వీడీ సతీశన్‌కు సీఎం శుభాకాంక్షలు
కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేరళం ప్రజలకు దశాబ్దాలుగా ేసవ లందిస్తూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న సతీశన్‌కు సముచిత గుర్తింపు లభించిందని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివద్ధికి మద్దతుగా.. విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎ్‌ఫకు ప్రజలు అధికారం అప్పగించారన్నారు. సతీశన్ నాయకత్వంలో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ సర్కారు సిద్థంగా ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీడీ సతీశన్‌కు టీపీసీసీ చీఫ్ మహే్‌షకుమార్‌గౌడ్ సైతం అభినందనలు తెలిపారు.