ట్యాంక్‌బండ్ శివకు రూ.5లక్షల సాయం
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:36 AM
ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. శివ కుటుంబానికి రూ.5 లక్షలతోపాటు అతడి కుమారుడు వేణుమాధవ్‌కు ...
అతడి కుమారుడికి హోంగార్డు ఉద్యోగం
స్వయంగా అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ట్యాంక్‌బండ్ శివకు ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక సాయం చేశారు. శివ కుటుంబానికి రూ.5 లక్షలతోపాటు అతడి కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేశారు. ట్యాంక్‌బండ్ పై నుంచి ప్రమాదశాత్తు పడిన, ఆత్మహత్య చేసుకోవాలని దూకిన.. ఎంతో మందిని శివ కాపాడారు. ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై శివ కుటుంబం ఇబ్బందులు పడుతుండగా, ఆ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తరఫున సాయం అందించాలని అప్పట్లో అధికారులను సీఎం ఆదేశించారు. తాజాగా మంగళవారం శివకు ఆర్థిక సాయంతోపాటు అతడి కుమారుడికి హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం ఆందజేశారు. ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో తనకు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరగా.. చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇంటిని సైతం మంజూరు చేయాలని సూచించారు.