దేశం గర్వించే విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్: సీఎం
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:56 AM
దేశం గర్వించే గొప్ప విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం న్యూఢిల్లీలోని..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): దేశం గర్వించే గొప్ప విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ దేశానికి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, పాల్గొన్నారు.