Share News

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 04:22 AM

ఆయా జిల్లాల కలెక్టర్లు రోజుకో అరగంట ప్రాజెక్టు పనుల పురోగతికి కేటాయించాలని, రోజువారీగా పనుల పరిశీలనను అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

రోజుకో అరగంట ప్రాజెక్టుల కోసమే: సీఎం రేవంత్‌

మహబూబ్‌నగర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఆయా జిల్లాల కలెక్టర్లు రోజుకో అరగంట ప్రాజెక్టు పనుల పురోగతికి కేటాయించాలని, రోజువారీగా పనుల పరిశీలనను అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనుల నిర్వాసితులకు రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా పూర్తిచేయాలని సూచించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న ఆయన.. రెండో రోజైన శుక్రవారం ఆయన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం హెడ్‌ రెగ్యులేటర్‌, నార్లాపూర్‌ రిజర్వాయర్‌, డెలివరీ సిస్టర్న్‌, కల్వకుర్తి పథకంలోని ఎల్లూరు పంప్‌హౌజ్‌; వట్టెం పంప్‌హౌస్‌, కరివెన, ఉదండాపూర్‌ రిజర్వాయర్లను పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి, వాకిటి శ్రీహరి తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 04:22 AM