Share News

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:09 AM

నల్లగొండ జిల్లాలో ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ టౌన్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లాలో ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. రూ.14,500 కోట్లతో నిర్మించనున్న హ్యామ్‌ రోడ్లకు శంకుస్థాపన, పైలాన్‌ ఆవిష్కరణ, బహిరంగ సభ నిర్వహించే ప్రదేశం, ఇతర ఏర్పాట్లపై చర్చించారు. హ్యామ్‌ రోడ్లతోపాటు, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎంతో శంకుస్థాపనలు నిర్వహించే విషయమై పలు సూచనలు చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 05:09 AM