Share News

రేవంత్‌ను కలిసిన పోచారం

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:39 AM

ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

రేవంత్‌ను కలిసిన పోచారం

  • సీఎంతో కలిసి ప్రత్యేక బస్సులో ప్రయాణం

కామారెడ్డి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివా్‌సరెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందుకు ముఖ్యమంత్రి హాజరుకాగా.. పోచారం శ్రీనివా్‌సరెడ్డి హెలిప్యాడ్‌ వద్ద రేవంత్‌ను కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం సీఎం తిరిగి వెళుతున్న సమయంలో హెలిప్యాడ్‌ వరకు ప్రత్యేక బస్సులో రేవంత్‌తో కలిసి వెళ్లారు. అయితే ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పోచారం.. ముఖ్యమంత్రితో కలిసి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - Aug 17 , 2026 | 06:41 AM