సీఎం రేవంత్‌తో గోదావరి బోర్డు చైర్మన్ భేటీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:42 AM
గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ పద్మా దొర్జే గ్యాంబా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ ...
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): గోదావరి నది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) చైర్మన్ పద్మా దొర్జే గ్యాంబా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా ఆయన భేటీ అయ్యారు. గోదావరి బోర్డుకు అవసరమైన నిధులు కేటాయించాలని ఆయన కోరగా... సీఎం అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గోదావరి బోర్డు సమావేశంలో అంగీకారం మేరకు నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో నీటి పారుదలశాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం చీఫ్ ఇంజనీర్ కె.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.