Share News

CM Revanth Reddy: నేడు ఖమ్మం జిల్లాకు సీఎం

ABN , Publish Date - Jan 18 , 2026 | 04:56 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించ నున్నారు. పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

CM Revanth Reddy: నేడు ఖమ్మం జిల్లాకు సీఎం

  • పాలేరులో 362 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

  • జేఎన్‌టీయూ కళాశాల భవనాలకు శంకుస్థాపన

  • ఇటు కాంగ్రెస్‌.. అటు సీపీఐ సభలకు హాజరు

ఖమ్మం/హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించ నున్నారు. పాలేరు నియోజకవర్గంలో రూ.362 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ త ర్వాత ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనవుతారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర, ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరనున్న సీఎం రేవంత్‌ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ రూ.108.60 కోట్లతో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే రూ.45 కోట్లతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్‌ కళాశాల భవనాలను ప్రా రంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో రూ.19.90 కోట్లతో ని ర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్‌ భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఇటు రూ.162.54 కోట్లతో మున్నేరు వృథా జలాలను పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే 9.5 కి.మీ గ్రావిటీ కెనాల్‌ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రచారానికి శ్రీకా రం చుట్టబోతున్నారు. ఈ సభ తర్వాత ఖమ్మంలో పొంగులేటి నివాసంలో సీఎం భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్సార్‌ అండ్‌ బీజీఎన్నార్‌ కళాశాల మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్‌లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.


ఆ పథకంతో 3 జిల్లాలకు సాగు నీరు: ఉత్తమ్‌

వరదల నివారణతో పాటు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన మున్నేరు-పాలేరు లింక్‌ పథకానికి సీఎం ఆదివారం శంకుస్థాపన చేస్తారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 4,500 క్యూసెక్కుల సామర్థ్యంతో 9.6 కిలోమీటర్ల మున్నేరు-పాలేరు లింక్‌ కాల్వ నిర్మాణానికి రూ.162.54 కోట్లను కేటాయించామని.. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాల్లో 1.38 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు పాలేరు రిజర్వాయర్‌ ఎగువ భాగంలోని 40 ఎకరాల నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు నీటి భద్రత లభిస్తుందని తెలిపారు. మున్నే రు నుంచి ఏటా సముద్రంలో వృథాగా కలిసే 50 టీఎంసీల వరద జలాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు వరద ముప్పును నివారించడానికి ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలోని మోతే ఎత్తిపోతల ద్వారా డీబీఎం-71 డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న 46,712 ఎకరాల ఆయకట్టుకు నిరంతరంగా సాగునీటి సరఫరా చేయొచ్చన్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం మిషన్‌ భగీరథ పథకానికి 4.70టీఎంసీల జలాలను కేటాయించామన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 04:56 AM