Share News

జోగులాంబ అమ్మవారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:10 AM

జోగులాంబ అమ్మవారి కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది.

జోగులాంబ అమ్మవారి   కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం
jogulamba

హైదరాబాద్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): జోగులాంబ అమ్మవారి కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆహ్వానం అందింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్‌ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి జోగులాంబ శక్తిపీఠం అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, శేష వస్త్రాలు అందజేశారు.

Updated Date - Oct 10 , 2026 | 06:10 AM