Share News

కుల వివక్ష నిర్మూలనే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jul 14 , 2026 | 05:32 AM

రాష్ట్రంలో కుల వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

కుల వివక్ష నిర్మూలనే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

  • జాతీయ కమిషన్‌ చైర్మన్‌కు ప్రభుత్వ చర్యల వివరాలు

హైదరాబాద్‌, జూలై13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కుల వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25ఎకరాల్లో ‘యంగ్‌ ఇండియా’ సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామని ఆయన జీతీయ ఎస్సీ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ కిశోర్‌మక్వానాకు వివరించారు. ఈ గురుకులాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ గురించి సీఎం ప్రస్తావించారు. విద్యార్ధులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పాఠశాలలోనే అందిస్తున్నామని తెలిపారు. అలాగే రవాణా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి ఆయన వివరించారు. ఎస్సీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 05:33 AM