Share News

తెలంగాణలో రెండున్నరేళ్ల పాలనలో పలు హామీలు అమలు చేశాం: సీఎం రేవంత్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 05:46 AM

తెలంగాణలో జరిగిన కులగణనపై సీడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. దేశానికే రోల్‌ మోడల్‌గా నిర్వహించారని పేర్కొంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి..

తెలంగాణలో రెండున్నరేళ్ల పాలనలో పలు హామీలు అమలు చేశాం: సీఎం రేవంత్‌

  • తెలంగాణలో కులగణన భేష్‌

తెలంగాణలో జరిగిన కులగణనపై సీడబ్ల్యూసీ ప్రశంసలు కురిపించింది. దేశానికే రోల్‌ మోడల్‌గా నిర్వహించారని పేర్కొంది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. తెలంగాణలో రెండున్నరేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలన, పార్టీ అభివృద్ధికి తీసుకున్న చర్యలు, డీసీసీల నుంచి మండల స్థాయిల వరకూ కమిటీల ఏర్పాటు తదితర అంశాలను రేవంత్‌రెడ్డి వివరించారు. 1.06 కోట్ల మంది ప్రజలకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించామని తెలిపారు. అర్హులందరికీ సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్చామని, గృహ అవసరాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతంపై నివేదిక ఇచ్చామని రఘువీర్‌ రెడ్డి తెలిపారు.

Updated Date - Aug 20 , 2026 | 05:48 AM