ఇది ఆరంభం మాత్రమే..!
ABN , Publish Date - May 31 , 2026 | 05:17 AM
తెలంగాణ రైజింగ్ అనేది ఎన్నో విజయగాథల సమాహారం. ప్రపంచ స్థాయి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి స్కిల్స్ వర్సిటీ విద్యార్థుల ...
స్కిల్స్ వర్సిటీ విద్యార్థుల విజయంపై సీఎం రేవంత్ హర్షం
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ రైజింగ్ అనేది ఎన్నో విజయగాథల సమాహారం. ప్రపంచ స్థాయి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి స్కిల్స్ వర్సిటీ విద్యార్థుల విజయం స్పష్టమైన నిదర్శనం. ఇది కేవలం ఆరంభం మాత్రమే’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ (వైఐఎస్యూ) విద్యార్థులు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసా్‌ఫ్టలో ఏడాదికి రూ.7 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం తన ఎక్స్ ఖాతాలో విద్యాఽర్థులను అభినందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తకాలకే పరిమితం కాకుండా వాస్తవ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్న స్కిల్స్ యూనివర్సిటీ అడుగులు సరైన దిశలోనే పడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఈ వర్సిటీలో సరికొత్త బీటెక్, బీఎస్సీ కోర్సులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఫ్యూచర్ సిటీలో నిర్మాణంలో ఉన్న అత్యాధునిక శాశ్వత క్యాంపస్ పనులు కూడా వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని ఆయన తెలిపారు.