జంతు సంరక్షణకు పెద్దపీట
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:15 AM
తెలంగాణ రాష్ట్రంలో జంతు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గోసంరక్షణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.
మేనకాగాంధీతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో జంతు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గోసంరక్షణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ఎన్కేపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో విశాల ప్రదేశంలో గోశాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఆలయాల వద్ద కూడా గోశాలల నిర్మాణం చేపడతామన్నారు. జంతుహక్కుల ఉద్యమకారిణి, కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డితో అసెంబ్లీలోని ఆయన చాంబర్‌లో భేటీ అయ్యారు. జంతుహక్కుల సంరక్షణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. మరోవైపు రాష్ట్రంలోని మునిసిపాలిటీల పరిధిలో వీధికుక్కల నియంత్రణ, గోసంరక్షణ చర్యలను మేనకాగాంధీ బృందానికి అధికారులు వివరించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్న వివరాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.