CM Revanth Reddy Extends New Year Greetings to Governor: గవర్నర్‌కు సీఎం శుభాకాంక్షలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:44 AM
నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.....
నూతన సంవత్సరం సందర్భంగాజిష్ణుదేవ్‌ను కలిసిన ముఖ్యమంత్రి
రేవంత్‌కు మంత్రుల శుభాకాంక్షలు
హైదరాబాద్, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గత రెండేళ్ల పాలన ఎంతో సంతృప్తిగా సాగిందని, ఈ ఏడాది కూడా ప్రజా సంక్షేమ పథకాలు మరింత సమర్థంగా అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్‌సిటీతోపాటు ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల గురించి సీఎం వివరించారు. నూతన సంవత్సరంలో సీఎం మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. అలాగే సీఎం రేవంత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్‌ను ఆయన నివాసంలో స్వయంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనను సన్మానించి సీఎం పుష్పగుచ్ఛం అందజేశారు. ఇటు సీఎం రేవంత్‌కు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, కొండా సురేఖ, సీతక్క, సీఎస్ రామకృష్ణారావు, అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, డీజీపీ శివధర్ రెడ్డితోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులున్నారు