Share News

ఆడబిడ్డలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 06:05 AM

రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఆడబిడ్డలకు సీఎం బతుకమ్మ శుభాకాంక్షలు
RevanthReddy

హైదరాబాద్‌, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సీఎం రేవంత్‌ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటపాటలతో వైభవంగా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్ట సుఖాలను కలిసి పంచుకునే ఐక్యతకు బతుకమ్మ పండుగ నిలువెత్తు నిదర్శనమని, తెలంగాణ ఆత్మగౌరవానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని సీఎం తెలిపారు.

Updated Date - Oct 10 , 2026 | 06:05 AM