ఢిల్లీలో సీఎం రేవంత్
ABN , Publish Date - Aug 05 , 2026 | 04:36 AM
సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఆయన కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖ మంత్రులను కలవనున్నారు.
నేడు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ అధికారులతో సమావేశం
ఏఐసీసీ పెద్దలనూ కలిసే అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం ఆయన కేంద్ర జలశక్తి, పర్యావరణ శాఖ మంత్రులను కలవనున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల మంజూరుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నీతి ఆయోగ్ అధికారులనూ ఆయన కలవనున్నట్లు తెలుస్తోంది. కాగా.. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అధిష్ఠానం పెద్దలతోనూ సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఢిల్లీలో పనులు ముగించుకుని బుధవారం రాత్రి లేదా గురువారం ఉదయం తిరిగి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.