Share News

ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది

ABN , Publish Date - Feb 14 , 2026 | 04:40 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అఖండ విజయం లభించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది

  • రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పునరంకితమవుతాం

  • జెండా మోసిన కార్యకర్తలకే ఈ విజయం అంకితం

  • మునిసిపల్‌ ఎన్నికల్లో విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అఖండ విజయం లభించడంతో తన బాధ్యత మరింత పెరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రెండేళ్ల ప్రజా పాలన, పేద, మధ్య తరగతి ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సంపూర్ణ ఆమోదం తెలిపారని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలనకు పునరంకితమవుతూ భవిష్యత్తులో ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ను గొప్పగా అభివృద్ధి చేసి, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. ‘‘రాష్ట్రంలోని 7 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అఖండ విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్‌ కా ర్యకర్తల శ్రమ ఫలితం. పార్టీ పట్ల వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల దరి చేర్చిన ప్రతి కార్యకర్తకూ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం’’ అని సీఎం తెలిపారు.

Updated Date - Feb 14 , 2026 | 04:40 AM