కేటీఆర్ దావత్ ఇస్తడేమో కనుక్కోండి!
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:56 AM
ముఖ్యమంత్రి విలేకరులతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పుట్టినరోజు ప్రస్తావన వచ్చింది. శుక్రవారం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారా? అని విలేకరులు ముఖ్యమంత్రిని అడిగారు.
అయినా, కష్టమేలే ఉన్నవి లేనివి పెట్టిండనుకో!
నేటి కేటీఆర్ పుట్టిన రోజుపై రేవంత్ వ్యాఖ్యలు
బర్త్‌డే వేడుకల్లేవ్... ధర్నాచౌక్‌లోనే ఉంటా!
హనుమకొండలో వెల్లడించిన కేటీఆర్
హైదరాబాద్, హనుమకొండ టౌన్, జూలై 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి విలేకరులతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పుట్టినరోజు ప్రస్తావన వచ్చింది. శుక్రవారం ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతారా? అని విలేకరులు ముఖ్యమంత్రిని అడిగారు. దానికి ముఖ్యమంత్రి సరదాగా స్పందిస్తూ, ఆయన దావత్ ఇస్తారేమో అడగండి అని విలేకరులను ఉద్దేశించి అన్నారు. నవ్వుల మధ్య కాస్త గ్యాప్ తీసుకొని, ‘‘ఆయన దావత్ ఇచ్చినా కూడా కష్టమేలే. ఉన్నవి లేవివి పెట్టిండనుకో’’ అంటూ సగంలోనే ఆగిపోయారు. మరోపక్క కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హనుమకొండ జిల్లా మడికొండలో కుట్టుమిషన్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన కేటీఆర్‌ను శుక్రవారం పుట్టినరోజును ఎలా జరుపుకోనున్నారని విలేకరులు అడిగారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జి నేపథ్యంలో ఈసారి పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఢిల్లీ విద్యార్థులకు సంఘీభావంగా ధర్నాచౌక్‌లో ధర్నాకు కూర్చుంటుకున్నట్లు తెలిపారు. చెల్లెలు కవిత అంశాన్ని కొందరు మహిళలు ప్రస్తావించగా, పిల్లలు తల్లిదండ్రులను బాధ పెట్టకుండా ఉండాలని సూచించారు.