నేడు కొడంగల్‌కు రేవంత్ రాక
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:37 AM
మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు వెళ్లనున్నారు.
మునిసిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం
హైదరాబాద్/ కొడంగల్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌కు వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తాండూరు రోడ్డులోని హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ స్నేహా మెహ్రా బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. సీఎం రేవంత్‌తోపాటు సోదరుడు తిరుపతి రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఆరవ వార్డు పోలింగ్ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఓటు హక్కును వినియోగించుకుంటారు. పోలింగ్ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళతారు.