సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:30 AM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణారావు సహా ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులు, సలహాదార్లకు శాఖలు కేటాయించారు.
మాజీ సీఎస్ రామకృష్ణారావుకు పరిశ్రమలు, ఐటీ..
శేషాద్రికి జీఏడీ, హోం, రెవెన్యూ, ఆర్థిక శాఖలు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణారావు సహా ముఖ్యమంత్రి కార్యాలయంలోని కార్యదర్శులు, సలహాదార్లకు శాఖలు కేటాయించారు. కె. రామకృష్ణా రావుకు.. పరిశ్రమలు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎనర్జీ, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫి, క్రీడలు, యూత్ సర్వీసెస్, సాంస్కృతిక, పర్యాటక శాఖలతోపాటు, హైదరాబాద్ మెట్రో రైలు, స్పీడ్ వ్యవహారాలు అప్పంగించారు. వి. శేషాద్రి సాధారణ పరిపాలనా, శాంతి భద్రతలు, లీగల్, హోం, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, లెజిస్లేటివ్, ల్యాండ్ రెవెన్యూ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, వ్యవసాయం, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, కోపరేటివ్, మార్కెటింగ్ వ్యవహారాలు చూడనున్నారు. ఎన్. శ్రీధర్‌కు రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యా, శక్తి బాధ్యతలు అప్పగించారు. కె. మాణిక్ రాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవల్‌పమెంట్, ఇరిగేషన్, రెవెన్యూ, మైన్స్, వైద్య, ఆరోగ్యం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, అటవీ, పర్యావరణం, శాస్త్ర, సాంకేతిక శాఖ బాధ్యతలు చూడనున్నారు. వేముల శ్రీనివాసులుకు స్త్రీ, శిశు సంక్షేమం, దేవాదాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమం, సీఎం పిటిషన్స్, ప్రజావాణి, సీఎంఆర్‌ఎఫ్, కంప్యూటరైజేషన్ ఆఫ్ సీఎంవో, సీఎంవో అడ్మినిస్ట్రేషన్ కేటాయించారు. ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్స్ వ్యవహారాలను సీఎం సీపీఆర్‌ఓ మల్సుర్‌కు అప్పగించారు.