భద్రాచలానికి రూ.351 కోట్లు
ABN , Publish Date - Mar 27 , 2026 | 04:27 AM
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాములవారి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ...
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
హైదరాబాద్, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాములవారి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. భద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం రూ.351 కోట్లను కేటాయించామని ప్రకటించారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యత దేశమంతటికీ చాటేలా నవమి వేడుకలను ఘనంగా జరుపుకోవాలని కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.