Share News

CM Revanth Reddy: సదరన్‌ కమాండ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌కు మార్చండి

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:29 AM

సదర్మాట్‌ బ్యారేజీ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్‌ అన్నారు. పొన్కల్‌ వద్ద బ్యారేజీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

CM Revanth Reddy: సదరన్‌ కమాండ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌కు మార్చండి

  • దేశ భద్రత అంశాల్లో సహకరించేందుకు తెలంగాణ ముందుంటుంది

  • పదేళ్లుగా రాష్ట్రానికి ఒక్క సైనిక్‌ పాఠశాల ఇవ్వలేదు

  • ఆర్మీ ఉన్నతాధికారులతో భేటీలో సీఎం రేవంత్‌

ఇంటర్నెట్ డెస్క్:దర్మాట్‌ బ్యారేజీ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్‌ అన్నారు. పొన్కల్‌ వద్ద బ్యారేజీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత సదర్మాట్‌ ఆయకట్టు, గంగానాలా ఆయకట్టు స్థిరీకరణకు 1.58 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నీటిని సాగు అవసరాలకు అనుగుణంగా విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు చనకా-కొరాటా ఆయకట్టుకు పెన్‌గంగా జలాలను అందించేందుకు రూ.107 కోట్లతో నిర్మించిన హత్తిఘాట్‌ పంప్‌హౌస్‌ను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా-మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రవహించే పెన్‌గంగా నదిపై భోరజ్‌ మండలంలో ఈ పంప్‌హౌస్‌ను నిర్మించారు. పంప్‌హౌస్‌ను ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటార్ల స్విచ్‌ ఆన్‌ చేసి ప్రధాన కాలువకు సాగునీటిని ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం పెన్‌గంగా జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌, బోథ్‌ ఎమ్మెల్యేలు పాయల్‌ శంకర్‌, అనిల్‌ జాదవ్‌, ఎంపీ గోడం నగేష్‌ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వం సలహాదారు సుదర్శన్‌ రెడ్డి, బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ఖానాపూర్‌, ముథోల్‌, కోరుట్ల ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, రామారావు పటేల్‌, సంజయ్‌, ఎమ్మెల్సీలు దండె విఠల్‌, అంజి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 05:30 AM