పదవి వచ్చిందని రిలాక్స్ కావద్దు
ABN , Publish Date - May 26 , 2026 | 04:28 AM
పదవి వచ్చేసిందని రిలాక్స్ కావద్దని, ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వివిధ...
కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సీఎం దిశానిర్దేశం
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): పదవి వచ్చేసిందని రిలాక్స్ కావద్దని, ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పనిచేస్తేనే మళ్లీ అవకాశాలు ఉంటాయని, లేకుంటే ఉండవని అన్నారు. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని వారంతా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. సీఎంను కలిసిన వారిలో రామిరెడ్డి, బండి రమేష్, చరణ్‌కౌశిక్, గజ్జి భాస్కర్ ఉన్నారు.