Share News

సీఎంతో భట్టి, పొంగులేటి భేటీ

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:35 AM

సీఎం రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఆదివారం సమావేశమయ్యారు.

సీఎంతో భట్టి, పొంగులేటి భేటీ

  • మునిసిపల్‌ ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఆదివారం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయనతో వారు భేటీ అయ్యారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. మునిసిపల్‌ ఎన్నికల ప్రచార సరళి, తీరు తెన్నులను వారు సీఎంకు వివరించారని సమాచారం. ఖమ్మం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని వారు చెప్పినట్లు తెలిసింది. మునిసిపల్‌ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకోవడంతో అనుసరించాల్సిన వ్యూహాలపైనా సీఎం రేవంత్‌తో వారు చర్చించినట్లు తెలియవచ్చింది.

Updated Date - Feb 09 , 2026 | 02:35 AM