Share News

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:27 AM

ఒలింపిక్స్‌లో పతకాలను సాధించడమే ధ్యేయంగా రాష్ట్రంలోని క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని, అందుకు అవసరమైన.....

ఒలింపిక్స్‌ పతకాలే లక్ష్యం

  • స్పోర్ట్స్‌ వర్సిటీని తీర్చిదిద్దండి

  • క్రీడాకారులకు శిక్షణ ఇవ్వండి

  • ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేలా ఆర్థిక ప్రణాళికలు రూపొందించండి

  • క్రీడా శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌ నిర్దేశం

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఒలింపిక్స్‌లో పతకాలను సాధించడమే ధ్యేయంగా రాష్ట్రంలోని క్రీడాకారులకు శిక్షణ ఇవ్వాలని, అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు నిర్దేశించారు. క్రీడా శాఖపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు కల్పించడం, అన్ని రకాల క్రీడలకు అవసరమైన మైదానాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించారు. గచ్చిబౌలి ఔట్‌డోర్‌ ేస్టడియాన్ని పునరుద్ధరించడంతోపాటు ఆవరణలో ఇండోర్‌ స్టేడియం, కాంప్లెక్స్‌, హాస్టల్‌ భవనాలు, వివిధ క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణాలకు సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించి, వాటిపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి, సరూర్‌ నగర్‌, ఎల్బీ స్టేడియాలను భవిష్యత్‌ అవసరాలు, శిక్షణ, పోటీల నిర్వహణకు అనుగుణంగా ఆధునీకరించాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు వాకిటి, పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్‌ రెడ్డి, క్రీడా విభాగం చైర్మన్‌ శివ ేసనా రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, క్రీడా విభాగం ఎండీ సోనీ బాలదేవి, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ జి.కిశోర్‌ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated Date - Mar 10 , 2026 | 03:27 AM