Share News

పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:25 PM

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎ మ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు.

పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ
ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేస్తున్న అజిలాపూర్‌ సర్పంచ్‌

- ఎమ్మెల్యే కశిరెడ్డి

కల్వకుర్తి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తోందని ఎ మ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని తన ని వాసంలో నియోజకవర్గం లోని లబ్ధిదారులకు మం జూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు లు, ఎల్‌వోసీ పత్రాలను ఎ మ్మెల్యే అందజేశారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలి చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్ధిదా రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో కల్వకుర్తి మాజీ జడ్పీటీసీ అశోక్‌రెడ్డి, కాంగ్రెస్‌ యువ నాయకులు హరీశ్‌రెడ్డి, నాయ కులు ఉన్నారు.

అభివృద్ధికి సహకరించాలని వినతి

వెల్దండ, (ఆంధ్రజ్యోతి) : తమ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరుతూ శనివారం అజిలాపూర్‌ గ్రామానికి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక సర్పంచ్‌ రమేష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కోరారు. గ్రామాభివృద్దికి పార్టీలకతీతంగా ప్రాఽదాన్యతనిచ్చి సహకరిస్తానని నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ గణేష్‌గౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, శేఖర్‌, వెంకటేష్‌ ఉన్నారు.

Updated Date - Aug 08 , 2026 | 11:26 PM