Share News

గజ్వేల్‌లో చల్లారని ఫొటో రచ్చ!

ABN , Publish Date - Apr 06 , 2026 | 04:56 AM

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టిన విషయమై చెలరేగిన రచ్చ ఇంకా ఆగలేదు.

గజ్వేల్‌లో చల్లారని ఫొటో రచ్చ!

  • సీఎం ఫొటో తీసేశారంటూ వంటేరుపై కాంగ్రెస్‌ ఫిర్యాదు

  • సోమవారం బంద్‌కు బీఆర్‌ఎస్‌ పిలుపు

గజ్వేల్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టిన విషయమై చెలరేగిన రచ్చ ఇంకా ఆగలేదు. ఆదివారం డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి మాట్లాడుతూ.. దాడులు తమ సంస్కృతి కాదని కేవలం సీఎం ఫొటో పెట్టడానికి మాత్రమే వెళ్లామని తెలిపారు. కాగా గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించి దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై మాట్లాడితే పెద్ద లీడర్‌ కారని, ప్రజలకు మంచి చేస్తేనే పెద్ద లీడర్‌ అవుతారని హితవు పలికారు. రాష్ట్ర మంత్రుల ఇళ్లలోనే సీఎం ఫొటోలు లేవని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. సోమవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో బంద్‌ చేపట్టామని, ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాలని కోరారు. ఇదిలా ఉండగా గజ్వేల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టిన సీఎం ఫొటోను ప్రతాప్ రెడ్డి తొలగించారని ఆయనపై గజ్వేల్‌ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు.

Updated Date - Apr 06 , 2026 | 04:56 AM