Share News

క్రీడల పండుగకు వేళాయె

ABN , Publish Date - Feb 20 , 2026 | 01:03 AM

క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ క్రీడా పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

క్రీడల పండుగకు వేళాయె

  • నేటి నుంచి సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌

  • 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్ల రాక

వరంగల్‌ స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంతో పాటు గ్రామాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ క్రీడా పోటీలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. సీఎం కప్‌ రెండో విడత-2026 రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు హనుమకొండ జిల్లా క్రీడా సమాఖ్య అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలోని సింథటిక్‌ ట్రాక్‌పై వేదికగా శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ అండర్‌-14, 16, 18, 20, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో 66 క్రీడాంశాల్లో 4 రోజుల పాటు క్రీడా పోటీలను నిర్వహించబోతున్నారు. సీఎం కప్‌ క్రీడా పోటీల షెడ్యూల్‌ ప్రకారం గత నెల 17న గ్రామస్థాయిలో ప్రారంభమై తదుపరి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు ఇప్పటికే ముగిశాయి. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ నిర్వహించేందుకు డీఎ్‌సఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు పలు జిల్లాలకు చెందిన అథ్లెట్లు హనుమకొండలోని జేఎన్‌ఎ్‌సకు చేరుకున్నారు. 33 జిల్లాల నుంచి 1,518 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనబోతున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 01:03 AM