kumaram bheem asifabad- మూతపడ్డ దాల్‌మిల్లులు
ABN , Publish Date - Jul 10 , 2026 | 10:25 PM
జిల్లాలోని గిరిజన మండలాల రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులకు విక్రయించి నష్టపోవల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేనపథ్యంలో కంది, జొన్న సాగుచేసుకునే గిరిజన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో వనబంధు కల్యాణ యోజన పథకం కింద సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీ ఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని వాంకిడి, తిర్యాణి మండలాల్లో గత ప్రభుత్వం దాల్‌మిల్లులను ఏర్పాటు చేసింది.
వాంకిడి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గిరిజన మండలాల రైతులు పండిస్తున్న పంటలకు సరైన గిట్టుబాటు ధర లేక దళారులకు విక్రయించి నష్టపోవల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేనపథ్యంలో కంది, జొన్న సాగుచేసుకునే గిరిజన రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో వనబంధు కల్యాణ యోజన పథకం కింద సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీ ఏ) ఆధ్వర్యంలో జిల్లాలోని వాంకిడి, తిర్యాణి మండలాల్లో గత ప్రభుత్వం దాల్‌మిల్లులను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణతో గిరిజన రైతులకు గిట్టుబాటు ధర లభించగా మరోవైపు మహిళా ఉత్పత్తిదారు సంఘాలకు వాటా రుపేణా లాభాలు అందాయి. దాల్‌మిల్లులు కొన్నేళ్ల పాటు మంచి ఫలితాలు ఇచ్చాయి.అనంతరం వీటి నిర్వహణను అధికా రులు పట్టించుకోకపోవడంతో మిల్లులు మూతపడ్డాయి. ఫలితంగా రైతు, మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లేకుండా పోతుంది.
- గిరిజన మహిళా సంఘాలను..
గిరిజన మహిళా సంఘాలను బలోపేతం చేయాలనే సంకల్పంతో అప్పటి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్ దాల్ మిల్లుల ఏర్పాటుకు కృషి చేశారు. 2017లో వాంకిడి, తిర్యాణి మండల కేంద్రా ల్లో రూ. 7.80 లక్షలతో మినీ దాల్‌మిల్లులను ఏర్పాటు చేశారు. వాంకిడిలో దాల్‌మిల్లుతో పాటు అదనంగా జొన్న పిండి, రవ్వ, తయారు చేసేందుకు రూ. 4 లక్షలతో యంత్రాలను ఏర్పాటు చేశారు. కెరమెరి మండలంలో ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో కందులు కోను గోలు చేపట్టారు. ఇక్కడ కొనుగోలు చేసిన కందులను వాంకిడి దాల్‌మిల్లులో పప్పు తయారు చేసి విక్రయిం చేవారు. తయారు చేసిన పప్పులను ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసే వారు. ఇప్పటికి ఆశ్రమ పాఠశాలలకు పంపిణీ చేసిన పప్పుకు సంబంధించిన డబ్బులు రావాల్సిఉందని అధికారులు చెబుతున్నారు.
- అధికారుల పర్యవేక్షణ లేక..
కొన్నాళ్లపాటు దాల్ మిల్లులు లాభాల బాటలో నడవ గా మహిళా సంఘాలకు సైతం లాభాల వాటా అందేది. క్రమేణా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడి కింది స్థాయి అధికారులు తమకేమీ పట్టన ట్లు వ్యవహరించడంతో అవి నష్టాల బారిన పడ్డాయి. దీంతో మూడేళ్ల నుంచి యంత్రాలు మూలనపడి తుప్పుపట్టాయి. ఉన్నతాధికారులు సైతం చొరవ చూపకపోవడంతో ఆయా మండలాల్లో కందుల కొను గోళ్లు సైతం నిలిచిపోయాయి. ఫలితంగా రూ. లక్షల విలువైన యంత్రాలు నిరుపయోగంగా మారాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి దాల్ మిల్లులను పునఃప్రారంభిస్తే మహిళా సంఘాలకు ఉపాధి లభిస్తుందని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయ పడుతున్నారు.
ప్రారంభంలో లాభాలు..
- కోనయ్య, ఏపీఎం,వాంకిడి
దాల్ మిల్లు ఏర్పాటైనా ప్రారంభంలో లాభాల బాటలో నడిచాయి. క్రమేణా నష్టాల బారిన పడ డంతో గత నాలుగేళ్ల నుంచి దాల్‌మిల్లుల నిర్వహణ కొనసాగడంలేదు. దాల్ మిల్లులోని యంత్రాలు సక్ర మంగా పనిచేయడంలేదు. వాటి స్థానంలో కొత్త యంత్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాం. రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా దాల్‌మి ల్లు కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పునఃప్రారంభిం చేలా చర్యలు తీసుకుంటాం.