kumaram bheem asifabad- గంగా జలం కోసం కొండలు ఎక్కి.. లోయలు దిగుతూ..
ABN , Publish Date - Jan 04 , 2026 | 10:42 PM
గంగా జలం కోసం మెస్రం వంశీయులు కొండలు ఎక్కుతూ, లోయలు దిగుతూ తరలివెళ్లారు .ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా మహా పూజ కోసం గంగా జలం తరలిన మెస్రాం వంశీయుల కాలినడక పాద యాత్ర ఆదివారం మండలంలోని ఢబోలి నుంచి వయ్యా జామ్ని మీదుగా హస్తిన మడుగుకు పయనమైంది.
జైనూర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గంగా జలం కోసం మెస్రం వంశీయులు కొండలు ఎక్కుతూ, లోయలు దిగుతూ తరలివెళ్లారు .ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌లో నిర్వహించే నాగోబా మహా పూజ కోసం గంగా జలం తరలిన మెస్రాం వంశీయుల కాలినడక పాద యాత్ర ఆదివారం మండలంలోని ఢబోలి నుంచి వయ్యా జామ్ని మీదుగా హస్తిన మడుగుకు పయనమైంది. ఈ సందర్భంగా మెస్రాం వంశీయులు పవిత్రమైన గంగా జలం కోసం కొండలు ఎక్కుతు.. లొద్దిలు దిగుతు తమ గమ్యానికి చేరుకునేలాకాలి నడక యాత్ర కొన సాగుతుంది. శనివారం రాత్రి ఢబోలిలో బస చేసిన మెస్రాం వంశీయులకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చారు. ఆదివారం ఉదయం వారి యాత్ర కొసాగింది. కఠోర నియమాలతో మేస్రాం వంశీయులు కాలి నడక పాద యాత్ర చేస్తుండడం అనవాయితీగా వస్తోంది.
సిర్పూర్(యు)కు చేరుకున్న మెస్రం వంశీయులు
సిర్పూర్(యు), జనవరి 4 (ఆంధ్రజ్యోతి): గంగా జలం కోసం బయలు దేరిన నాగోబా దేవుడి జారీ సిర్పూర్(యు)కు ఆదివారం చేరింది. ఈ సందర్భంగా సిర్పూర్(యు) గ్రామంలో నాగోబా దేవుడి జారీకి మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు,మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, సిర్పూర్(యు) సర్పంచ్ ఆత్రం ఓంప్రకాష్,గ్రామ పటేల్ ఆత్రం ఆనంద్‌రావులు ఘనంగా స్వాగతం పలకారు. కేస్లాపూర్ నాగోబా ఆలయం గంగా జలం కోసం బయలు దేరిన మెస్రం వంశీయులు ఆదివారం మండలంలోని ధనోర గ్రామంలో బస చేస్తున్నట్లు ధనోర సర్పంచ్ మెస్రం భూపతి తెలిపారు. ఈ సందర్భంగా ధనోర గ్రామస్తులు నాగోబా జారీను ఘనంగా స్వాగతం పలకరు.సోమవారం గంగా జలం సేకరణ కోసం హస్తానమడుగు బయలు దేరుతారని తెలిపారు.